కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై విమర్శలు చేస్తూ ఆమె నోరు జారారు. గతంలో తనతో కలిసి పనిచేసినప్పుడు ఆ మనిషి ఎత్తు తక్కువే కానీ ఇప్పుడు అహంకారం మాత్రం చాలా ఎక్కువైందని ప్రియాంకా సంచలన కామెంట్స్ చేశారు. ఎవరైనా అవసరం కోసం తన దగ్గరికి వెళ్లాలంటే మహారాజ్ అని సంబోధించాలని.. ఈ విధంగా సింధియా తన రాజ కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. గ్వాలియర్, చంబల్ ప్రజలకు సింధియా నమ్మక ద్రోహం చేశారని ప్రియాంక ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో ఉద్యోగ కల్పనలో దేశంలోనే ప్రముఖంగా నిలుస్తుంటే మధ్యప్రదేశ్లో మాత్రం అత్యల్పంగా ఉందని ప్రియాంక అన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా నటిస్తారని విమర్శించారు. ఎవరైనా చేసిన పనుల గురించి అడిగితే మాత్రం కమీడియన్‌గా మారతారంటూ ప్రియాంకా గాంధీ ఎద్దేవా చేశారు.