ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన నేపథ్యంలో… కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు ప్రకటన చేసింది. రేపు పాకిస్తాన్ సరిహద్దుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ డ్రిల్ జరుగుతుందని వెల్లడించింది.

ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా సూచనలు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేల కేంద్ర ప్రభుత్వం ఇలాగే మాక్ డ్రిల్ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దయాది పాకిస్తాన్ దేశం పైన ఇండియా దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి కనిపించింది ఇండియన్ ఆర్మీ.