పిల్లల భవిష్యత్తు గురించి.. తల్లిదండ్రులు భయపడే విషయాలు..!

-

తల్లిదండ్రులు పిల్లలను ఆత్మవిశ్వాసంతో పెంచాలని అనుకుంటారు. కాకపోతే, పిల్లలు ఎదిగే వాతావరణం మారడం వలన మరియు సమాజంలో మార్పులు రావడం వలన వారి భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు ఎంతో భయపడుతూ ఉంటారు. పిల్లల శారీరక భద్రత కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతారు. అంతేకాకుండా, శారీరక మరియు మానసిక ఆరోగ్యం గురించి కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఆహారపు అలవాట్లు, ఉబకాయం వంటి ఇతర సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు.

అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైతే చదువులో వెనుకబడుతారో, వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ విధంగా విద్య మరియు భవిష్యత్తు పై పిల్లలు ఎలా సాధించగలరు అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఈ మధ్య కాలంలో పిల్లలు సోషల్ మీడియాను మరియు మొబైల్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాని వలన, పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనివలన, తల్లిదండ్రులు సోషల్ మీడియా మరియు సాంకేతికత ప్రభావం గురించి ఎంతో ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో, పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని ఎంతో కలిగి ఉండడం లేదు. దాని వలన వారిలో ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక ఇటువంటి భయాలు కూడా తల్లిదండ్రులు ఎదుర్కొంటారు. సహజంగా పిల్లలు పాఠశాల, కళాశాల లేదా కార్యాలయంలో ఉన్నప్పుడు స్నేహితులు మరియు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు తప్పుడు మార్గంలో వెళ్లే విధంగా ప్రేరేపించవచ్చు. కనుక వారి స్నేహితులు వారికి సరైన మార్గంలో ఉంటారా అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎప్పుడైతే సరైన స్నేహితులు ఉండరో, పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి భయాలు తల్లిదండ్రులు అందరికీ సహజమే. కనుక సరైన చర్యలను తీసుకుని పిల్లల భవిష్యత్తు పై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news