వెయ్యేళ్లు గుర్తుంచుకునేలా మూడోసారి పాలన: మోదీ

-

ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014లో భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందని తెలిపారు. ఆర్థికవ్యవస్థలో ప్రపంచంలో 11 వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చామని చెప్పారు. తాను మూడోసారి ప్రధాని అయ్యాక దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని హామీ ఇచ్చారు. తాము సాధించిన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ ప్రధాని ప్రసంగించారు.

“పేదల కోసం మేం 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. పట్టణ పేదల కోసం 80 లక్షల ఇళ్లు నిర్మించాం. ఇండియా అలయన్స్‌ అలైన్‌మెంట్‌ దెబ్బతింది. ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదు. ఇండియా కూటమిలోని పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారు? బీజేపీకి 370కి పైగా సీట్లు ఖాయం. అయోధ్యలో రామాలయాన్ని దేశానికి కొత్త వెలుగు ఇచ్చేలా నిర్మించాం. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు తథ్యం. బీజేపీకే 370కి పైగా సీట్లు వస్తాయి.” అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news