రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , పంచాయితీ రాజ్ , గ్రామాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం రోజున ములుగు లోని గట్టమ్మా దేవాలయాన్ని దర్శించుకుని, అక్కడినుంచి బయలుదేరి సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ..వనదేవతల అనుగ్రహంతో నాడు పరాయి పాలన నుంచి విముక్తి లభించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు.
చిలుకల గుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దెల మీదకి తీసుకొస్తున్న సమయంలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 6000 బస్సులు జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతాము అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎటు వెళ్లిన ఉచిత ప్రయాణం చేయొచ్చు అన్నారు. సమ్మక్క ,సారలమ్మ దేవతల ఆశీర్వాదంతో ఎన్నో సంవత్సరాల నెరవేరిందని అన్నారు.