ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 9న అన్నారు. మోడీ అధికారంలోకి రాగానే మరుసటి లేదా ఆ తరువాత సంవత్సరాలలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. జార్ఖండ్ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం రాగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం నుండి మూడవ స్థానానికి చేరుకుంటుంది.
దీనిని సాధించడానికి జార్ఖండ్ సహకారం అవసరమని అన్నారు. దేశ శ్రేయస్సు కోసం, అవినీతి రహిత పాలన అందించడానికి మాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇంతకుముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత ఎఫ్పై 25 జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతానికి పెంచింది. అలాగే, మే 8న, ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ఎవ్వై 24లో భారతదేశ ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.