పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్… తన సహచర ఓపెనర్ బాబర్ అజామ్ తో బ్యాటింగ్ పార్ట్నర్ షిప్ గురించి ఫన్నీ కామెంట్ చేశారు. ‘నా బ్యాటింగ్, బాబర్ బ్యాటింగ్ సేమ్. మా మధ్య ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్ ‘ అంటూ న్యూజిలాండ్ తో వామప్ మ్యాచ్ అనంతరం అన్నారు. దీంతో రిజ్వాన్ ఇంగ్లీష్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పెలుతున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అని మాట విన్నాం….కానీ, ఈ ఫిజిక్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కాగా, WCలో భాగంగా హైదరాబాదులో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తోలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 345/5 రన్స్ చేసింది. రిజ్వాన్ 103, బాబర్ 80, షకీల్ 75 రన్స్ తో రాణించారు. 346 టార్గెట్ ను కివిస్ 43.3 ఓవర్లలో ఛేదించింది. రచిన్ రవీంద్ర 97, చాప్ మన్ 65, మిచెల్ 59, విలియంసన్ 54 రన్స్ చేశారు. మరో మ్యాచ్ లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 7 వికెట్లతో విజయం సాధించింది.