ఎడిట్ నోట్: ఎలక్షన్ ఫైట్.!

-

తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది..ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడిలో ఉన్నాయి. ఓ వైపు అభ్యర్ధులని ఖరారు చేయడం, మేనిఫెస్టో, విమర్శలు ఇలా రాజకీయంగా పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది.అయితే ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక విషయంలో బి‌ఆర్‌ఎస్ ముందున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 119 స్థానాలకు గాను 115 మంది అభ్యర్ధులని ప్రకటించింది. ఇక అందులో మల్కాజిగిరి అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ కూడా అభ్యర్ధిని సెట్ చేసుకోవాలి.

ఇక బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టోని సైతం తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బి‌ఆర్‌ఎస్..తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు మాదిరిగా ముందుకెళుతున్నాయని చెబుతున్నారు. అవి కొనసాగాలంటే మళ్ళీ బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని అంటున్నారు. అలాగే సరికొత్త పథకాలతో మేనిఫెస్టో తయారు చేస్తామని చెబుతున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇటు కాంగ్రెస్ పరిస్తితి చూస్తే..అభ్యర్ధుల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతుంది. ఒకో సీటులో ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. అందుకే అభ్యర్ధుల విషయంలో ఆచి తూచి కాంగ్రెస్ అడుగులేస్తుంది. అయితే మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ ముందు ఉంది. అందరికంటే ముందు 6 గ్యారెంటీలు అంటూ మేనిఫెస్టో ప్రకటించేసింది. ఇక ప్రత్యర్ధి బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తూ..పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.

బి‌జే‌పి విషయానికొస్తే..ఆ పార్టీలో విచిత్ర పరిస్తితులు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక ఇంకా జరగడం లేదు. మేనిఫెస్టో అంశంపై చర్చ లేదు. ఇక నాయకుల మధ్య సమన్వయం లేదు. అందులో కొందరు నేతలు పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది.కాకపోతే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అడపాదడపా రాష్ట్రానికి వస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగేలా ఉంది. బి‌జే‌పి కొంతవరకే పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news