ఈ ఏడాదిలో సాధారణ స్థాయిలోనే వర్షాలు

-

భారత్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలే కురుస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిమీలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణంగా, ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

‘బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్ సహా తూర్పు రాష్ట్రాల్లో వర్షపాత లోటును ఎదుర్కొంటాయి. కేరళ, కర్ణాటక, గోవాలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఎల్ నినో నుంచి లా నినాకు మారడం వల్ల సాధారణ రుతుపవనాలు వస్తాయి. ఎల్నినో కాకుండా ఐవోడీ వంటి ఇతర అంశాలు కూడా రుతుపవనాలను ప్రభావితం చేస్తాయి. ఎల్నినో నుంచి లా నినాకు వేగవంతమైన మార్పు సీజన్ ప్రారంభానికి అంతరాయం కలిగిస్తుంది.’ అని స్కైమెట్ ఎండీ జితిన్ సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version