లోక్​సభలో బీజేపీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షణాల్లోనే క్షమాపణలు

-

తమిళనాడుకు చెందిన మరో నేత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. బీజేపీని ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ కేవలం గోమూత్ర అని పిలువబడే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలువగలుగుతుందని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. జమ్ముకశ్మీర్‌లో గెలువలేమని తెలిసే ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి గవర్నర్‌ ద్వారా అధికారం చెలాయిస్తోందని ఎంపీ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో  బీజేపీకి గెలుపు దక్కే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

“బీజేపీ ఇటీవలి కొన్నిరాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. మైక్రో మేనేజ్‌మెంటు ద్వారా వరుసగా ఎన్నికల్లో గెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఏమైంది…? అక్కడ ఎందుకు గెలవలేకపోయారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి…గవర్నర్‌ ద్వారా అధికారం చెలాయిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో గెలిచే సత్తా, సమర్థత ఉంటే కేంద్రపాలిత ప్రాంతం చేసేవారుకాదు. భాజపా అధికారం కేవలం గోమూత్ర అని పిలవబడే హిందీ రాష్ట్రాల్లోనే అని దేశ ప్రజలు తెలుసుకోవాలి. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు రాలేదు. “అని లోక్ సభ సాక్షిగా సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news