నన్ను సీఎంని చేస్తే ఆ సీక్రెట్ చెబుతా : శరత్‌కుమార్‌

-

సినీ నటుడు, ఎస్​ఎంకే అధ్యక్షుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే ఓ సీక్రెట్ చెబుతానంటూ వ్యాఖ్యానించారు. మదురై పళంగానత్తంలో అఖిల భారత సమత్తువ మక్కల్‌ కట్చి 7వ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 ఏళ్లు జీవించే రహస్యం చెబుతానని శరత్‌కుమార్‌ అన్నారు.

మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందని శరత్ కుమార్ అన్నారు. గంజాయి, గుట్కా తదితర వాటి వాడకాన్ని వేగంగా నియంత్రిస్తున్నట్లు చెప్పారు. 2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్‌ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని, దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 69 ఏళ్ల వయసున్న తాను 150 ఏళ్ల వరకు జీవించేందుకు రహస్యాన్ని కనుగొన్నాని, 2026లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news