IPL 2023 : లక్నోతో ప్లేఆఫ్ మ్యాచ్ లో ముంబై అరుదైన రికార్డు నెలకొల్పింది. ఓ ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాటర్ కూడా 50 చేయకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు సన్రైజర్స్ పేరుమీద ఉంది. 2018లో ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై పై SRH ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
ప్లేఆఫ్ మ్యాచుల్లో ఇలా జరగడం చాలా అరుదు. కాగా, ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో LSG ఓడిపోవడానికి రనౌట్ లు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. LSG బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్ రనౌట్ అయ్యారు. ఇలా ముగ్గురు ముఖ్యమైన బాటర్లు రన్ అవుట్ కావడంతో ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని లక్నో చేదించలేకపోయింది. మరోవైపు ముంబై ఆటగాళ్లు ఫీల్డింగ్ లో అదరగొట్టారు. అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయాన్ని సాధించారు.