ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో LSG ఓడిపోవడానికి రనౌట్ లు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. LSG బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్ రనౌట్ అయ్యారు. ఇలా ముగ్గురు ముఖ్యమైన బాటర్లు రన్ అవుట్ కావడంతో ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని లక్నో చేదించలేకపోయింది. మరోవైపు ముంబై ఆటగాళ్లు ఫీల్డింగ్ లో అదరగొట్టారు.
అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయాన్ని సాధించారు. కాగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చేరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2 లో గుజరాత్ తో తలపడునుంది. ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది.