క్రికెట్ ఆడేముందు సెక్స్ చేయాలిః మాజీ కోచ్ పాడీ అప్టన్ వివాదాస్ప‌ద కామెంట్లు

-

టీమ్ ఇండియా మాజీ మెంట‌ల్ కండీషనింగ్ కోచ్ అయిన పాడీ అప్టన్ Paddy Upton సంచ‌ల‌న ప్రకటన చేశారు. ఆయ‌న స్పందిస్తూ మ్యాచ్ కు ముందు ఆట‌గాళ్లు సెక్స్ చేయాలని సలహా ఇచ్చాడు. అయితే ఇది ఆయ‌న డైరెక్టుగా మాట్లాడ‌లేదు. తాను రాసిన ది బేర్ ఫుట్ కోచ్ అనే పుస్త‌కంలో ఈ వ్యాఖ్య‌ల‌ను వెల్ల‌డించారు. ఇక తన సలహా అప్పటి భారత జట్టు ప్రధాన కోచ్ అయిన గ్యారీ కిర్ స్టన్ కు కోపం తెప్పించిందని రాసుకొచ్చారు.

పాడీ అప్టన్ /Paddy Upton

గ్యారీ కిర్ స్టన్ కోచ్ గా ఉన్నప్పుడు ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుందని అప్ట‌న్ వెల్ల‌డించారు. ఇక త‌న స‌ల‌హా విన్నాక కోపంగా ఉన్న గ్యారీ కిర్ స్టన్ కు అప్ట‌న్ అప్ప‌ట్లో క్షమాపణలు కూడా చెప్పాడంట‌. ఇక పాడీ అప్టన్ రాజస్థాన్ రాయల్స్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు.

ఇక పాడీ త‌న స‌ల‌హాపై క్ష‌మాప‌ణ‌లు కూడా కోరాడు. ఆట‌కు ముందు సెక్స్ చేయమని సలహా ఇవ్వడం పెద్ద తప్పు అని వివ‌రించాడు. ఇక పాడీ 2009లో ఛాంపియన్ ట్రోఫీకి టీమ్ ఇండియా సిద్ధమవుతున్న సమయంలో ఆటగాళ్ల కోసం కొన్ని నోట్స్ ను సిద్ధం చేసిన‌ట్టు రాసుకొచ్చాడు. అందులో తాను సెక్స్ ప్రయోజనాల వివరించాన‌ని చెప్పాడు. ఇక తాను రెడీ చేసిన నోట్స్‌లో శారీరక సంబంధాలు కలిగి ఉండటం మీ పనితీరును మెరుగుపరుస్తుంది అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version