రిజర్వాయర్ గోడపై రీల్స్.. జారి డ్యామ్ లో పడి యువకుడు మృతి

-

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని.. రీల్స్, వీడియోలు చేస్తూ.. లైకులు, వ్యూస్ కోసం నేటి యువత ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకుంటోంది. ఇప్పటికే పలు ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా.. ఈ తరంలో కొందరి తీరు మారడం లేదు. ఫేమస్ అవ్వాలని పోయి ప్రాణాలు పోగొట్టుకుంటూ కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రీల్ చేస్తూ డ్యామ్ లో పడిన యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర నాగ్ పుర్ కు చెందిన ఆకాశ్ చకోలే (23) తన ఫ్రెండ్స్ తో కలిసి మకర్న్డ్ డ్యామ్ కు వెళ్లాడు. అక్క ఈ ముగ్గురు రిజర్వాయర్ గోడపైకి ఎక్కారు. ఆకాశ్ గోడపైన ఎక్కి రీల్స్ చేస్తుండగా.. మిగతా ఇద్దరూ ఆ గోడకు వేలాడుతూ ఆకాశ్ ను కిందకు రమ్మని చెప్పారు. అయినా అతడు వినకుండా నీటిప్రవాహం ఉన్న రిజర్వాయర్ గోడపై నిల్చొని రీల్స్ చేయసాగాడు. ఈ క్రమంలోనే కాసేపటికే బ్యాలెన్స్ తప్పి డ్యామ్ లో పడిపోయాడు. ఆ తర్వాత కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నించినా విఫలమయ్యారు. కొన్ని గంటల తర్వాత ఆకాశ్ మృతదేహం లభ్యమైంది.

Read more RELATED
Recommended to you

Latest news