సున్నా మార్కులొచ్చినా నీట్‌ పీజీ సీటు

-

నీట్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్. నీట్ పరీక్ష రాసి సీటు రాలేదా. అయితే మీకోసమే ఈ స్టోరీ. నీట్ పరీక్షలో సున్నా మార్కులు వచ్చినా సీటు ఖాయం. అదెలాగంటారా..? నీట్ పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది. అన్ని కేటగిరీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.

కటాఫ్‌ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ తెలిపింది. ఇప్పటికే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో కొన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని.. పారాక్లినికల్‌, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్త్రీ సహా పలు పీజీ కోర్సుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ ఏడాది మొదటి రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత మూడో రౌండ్‌కు సీట్లు భారీగా మిగిలాయని తెలిపారు. మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు 13 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎంసీసీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news