టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల, అనగాని మరియు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ సమావేశాల నుంచి ఒక రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వేటు వేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన చేస్తూ వీడియోస్ తీస్తున్నారని పయ్యావుల, కోటంరెడ్డి, అనగానివి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం జగనుకు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. నినాదాలు చేస్తోన్న టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల తరుణంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఏసీకి వెళ్లకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. కేసులు ఎత్తేయాలనేదే తమ అజెండా అని స్పష్టం చేసిన టీడీఎల్పీ….బీఏసీకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది.