దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిన పరీక్ష మార్గదర్శకాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండేలా ఈ నియమ నిబంధనలను రూపొందించారు.
డ్రెస్ కోడ్ ఇలా
- పరీక్షకు హాజరయ్యే పురుష అభ్యర్థులు హాఫ్ స్లీవ్ షర్టులు, టీ-షర్టులు మాత్రమే ధరించాలి.
- పరీక్ష రాసే అభ్యర్ధులు ఉంగరాలు, కంకణాలు, చెవిపోగులు వంటి మెటల్ ఆభరణాలు ధరించరాదు.
- పేపర్లు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్‌లు, పెన్ డ్రైవ్‌లు, డిజిటల్ వాచీలు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన వస్తువులు
- అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి.
- పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి.
- రిపోర్టింగ్ సమయానికి పరీక్ష హాలుకు చేరుకోవాలి.