చెలరేగిన డూప్లెసిస్.. RCB నాలుగో విజయం

-

2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయం నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్​తో తలపడ్డ ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (64 పరుగులు, 23 బంతుల్లో; 10×4, 3×6) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దినేశ్ కార్తిక్ (21*) రాణించాడు.

148 పరుగుల ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42), ఫాఫ్ డూప్లెసిస్ (64) , విల్ జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), గ్లెన్ మ్యాక్స్​వెల్ (4), కామెరూన్ గ్రీన్ (1), విరాట్ కోహ్లీ (42) ఔటయ్యారు.  24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో దినేశ్ కార్తిక్ (21*), స్వప్నిల్ సింగ్ (10*) బెంగళూరు విజయాన్ని ఖాయం చేశారు. గుజరాత్ యంగ్ బౌలర్ జోషువా లిటిల్ ..డూప్లెసిస్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్​వెల్, గ్రీన్​ను పెవిలియన్​ చేర్చాడు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు శుభ్​మన్ గిల్(2), వృద్ధిమాన్ సాహ (1), షారుక్​ ఖాన్ (37 పరుగులు), డేవిడ్ మిల్లర్ (30 పరుగులు), రాహుల్ తెవాటియా (35 పరుగులు), రషీద్ ఖాన్ (18 పరుగులు) , విజయ్ శంకర్ (10 పరుగులు) విఫలమవ్వడం వల్ల గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ తలో 2, గ్రీన్, కర్ణ్ శర్మ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news