ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీలో చేరిన విషయం విదితమే. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గి, ఇతర రాష్ట్ర నాయకుల సమక్షంలో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. అయితే ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఆయన నటించిన సినిమాల్లోని సీన్లు, వాటి పోస్టర్లకు చెందిన ఫొటోలను తీసుకుని.. వాటిని తాజా విషయంతో పోల్చి మరీ జోకులు వేస్తున్నారు.
మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరడం ఏమోగానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారికి చేతినిండా పనిదొరికినట్లు అయింది. దీంతో వారు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈడీ, ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకే మిథున్ బీజేపీలో చేరారని కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఆయన బీజేపీలో చేరాక స్వామీజీలా మారాలని కోరుకుంటున్నామని మరికొందరు పోస్టులు పెట్టారు. ఇలా ఆయనపై అనేక మీమ్స్ కూడా వస్తున్నాయి.
#mithunchakraborty after joining BJPiiii 😝 pic.twitter.com/HqlOwAOj8b
— ITUS ✌️ मीडिया (@Amrk94) March 7, 2021
#mithunchakraborty be like 😂😂😜😜 pic.twitter.com/bKAR313Wp1
— बाबूराव गणपतराव आप्टे (@baburao__aapte) March 7, 2021
#mithunchakraborty hiding from ED & IT after joining BJP! You can someday find him in a CD.😂😂 pic.twitter.com/FNfvDsEUCs
— पौने दो आँखवाला (@PONEDO_AANKH) March 7, 2021
#mithunchakraborty Joins the BJP today . #BengalElections2021
Le Mithun da : pic.twitter.com/Cw1RDY39rs— OMKAR GAWARE1607 (@gaware1607) March 5, 2021
BJP HR: Why Should We Hire You?#mithunchakraborty: pic.twitter.com/ihnEGxSyHm
— #BanglaNijerMeyekeiChay (@EnergyMamata) March 7, 2021
కాగా ఇటీవలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌ను మిథున్ చక్రవర్తి పలుమార్లు కలిశారు. ఈ క్రమంలోనే మిథున్ బీజేపీలో చేరుతున్నారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆయన అప్పట్లో ఆ వార్తలను ఖండించారు. అయినప్పటికీ ఆయన తాజాగా బీజేపీలో చేరడం అందరినీ షాక్ కు గురి చేసింది.