WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్..

-

WhatsApp Web : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్స్ లో ఉన్న ‘ఛానెల్స్ ఫీచర్’ను ఇప్పుడు వాట్సాప్ లో తీసుకొచ్చింది. భారత్ సహా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కొంత మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

ఇక తాజా గా ఇప్పుడు మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. వాట్సప్ వాయిస్ మెసేజ్ ల కోసం ‘వ్యూ వన్స్’ ఫీచర్ ను పరీక్షిస్తుంది. ప్రస్తు తం ఫోటోలు, వీడియోలకు మాత్రమే ఉన్న ఈ ఫీచర్…. త్వరలో వాయిస్ నోట్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్స్ ను సేవ్ చేయలేరు, ఫార్వర్డ్ చేయలేరు. ఒకసారి వినగానే మెసేజ్ అదృశ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ ని ఉపయోగిస్తున్నఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news