కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం.. ముహుర్తం ఎప్పుడంటే?

-

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. అయితే కూటమి కూడా ఎన్డీఏకు గట్టిగా పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారంపై చర్చ జరుగుతోంది. జూన్ 9 లేదా 10వ తేదీన కొత్తగా ఎన్నికైన ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రపతి భవన్​లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమావేశం జరిగిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర భద్రతా సంస్థలు, దిల్లీ పోలీసులు ప్రమాణ స్వీకారానికి పటిష్ఠ భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది కొత్త ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 1న వెలువడిన లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news