ట్రిపుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి

-

10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కాస్త వెనుకబడిపోయింది. మరే పార్టీకంటే ఎక్కువ సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినా ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది.

మధ్యహ్నం 12 గంటల సమయానికి ట్రిపుల్ సెంచరీ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే’యూపీఏ’ నుంచి ‘ఇండియా’గా మారుస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఈసారి మంచి ఫలితాలను రాపడుతూ సక్సెస్ అయింది. ఎన్డీఏ కూటమి గతంతో పోలిస్తే దాదాపు 50 సీట్లను కోల్పోయింది. ‘ఇండియా’ టీమ్ మాత్రం సుమారు 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. యూపీ, బిహార్, కర్ణాటక,హర్యానా, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఈసారి బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

యూపీలో బీజేపీ అంచనాలను అందుకోలేక పోతుంది. మొత్తం 80 స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీకి గతంలో ఉన్న 62 స్థానాలు వస్తే ఈసారి మాత్రం 34 స్థానాలకే పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 35కు చేరుకున్నది. కాంగ్రెస్ సైతం తన ఒక్క సిట్టింగ్ స్థానాన్ని ఈసారి 7కు పెంచుకున్నది. బిహార్‌లో కూటమిగా తన స్థానాన్ని ఎన్డీఏ పదిలపర్చుకున్నా ఆర్జేడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 స్థానాల్లో గెలుపొందినా ఈసారి 7 స్థానాలను కోల్పోవడంతో వాటిని కాంగ్రెస్ దక్కించుకుంటున్నది. ఒక్క స్థానం నుంచి 7 వరకు కాంగ్రెస్ తన గ్రాఫ్‌ను పెంచుకున్నది. హర్యానాలో సైతం బీజేపీ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

Read more RELATED
Recommended to you

Latest news