World Cup 2023 : న్యూజిలాండ్ -టీమిండియా సెమీస్ మ్యాచ్ రద్దు కానుందా అంటే అవుననే చెప్పాలి. ఆదివారం జరగనున్న భారత్-నెదర్లాండ్ మ్యాచ్ లో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజి ముగియనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ లు ఖరారు అయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్ కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి.
నవంబర్ 15న ముంబైలోని వాంకడే స్టేడియంలో తొలి సెమీఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టు అమీతుమీ తేల్చుకొనున్నాయి. అయితే భారత్-కివీస్ మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే ఏంటి పరిస్థితి అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. అంటే బుధవారం వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే…. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి గురువారం తిరిగి కొనసాగించనున్నారు.