ఊర్లల్లో పశువులను పెంచే వాళ్లు.. వాటితో పాటు కోళ్లను కూడా పెంచుతుంటారు. వీటి కోసం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కానీ అదనంగా ప్రయోజనాలుు ఉంటాయి. మామూలు కోళ్ల కంటే టర్కీ కోళ్లను పెంచండి. లాభం మాములుగా ఉండదు. వెయ్యి కోళ్లను పెంచితే.. ఏడాదికి పది లక్షల ఆదాయం పొందవచ్చు.
పౌల్ట్రీ కోళ్ల మాదిరిగా, టర్కీలను ఇంట్లో పెంచుతారు. అప్పుడు వాటిని వివిధ పెద్ద మార్కెట్లలో టోకుగా విక్రయిస్తారు. రిటైల్ విక్రయాలు కూడా ఉన్నాయి. ఒక టర్కీ 6-7 కిలోల బరువు ఉంటుంది. కొన్నిసార్లు దాని కంటే ఎక్కువ బరువు ఉంటుంది. పౌల్ట్రీ చికెన్ కంటే రైతులకు కిలో టర్కీకి చాలా ఎక్కువ ధర లభిస్తుంది. కానీ టర్కీ పెరగడానికి చాలా సమయం పడుతుంది. టర్కీ వ్యవసాయం చాలా లాభదాయకమైన వ్యాపారమని అక్కడి రైతులు అంటున్నారు. సరిగ్గా చేస్తే, ఇంటిని నడపడం సమస్య కాదు. సరైన పెంపకం తక్కువ ఖర్చుతో చేయవచ్చు.
బి3, బి6 వంటి విటమిన్స్ ఎక్కువగా ఉండటం తో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉన్నటర్కీ కోళ్ల పెంపకంతో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. దాదాపు 9 కిలోలు పెరిగే టర్కీ కోడి ఏడు నెలల్లోనే మార్కెటింగ్ చేయడానికి వీలవుతుంది. ఇక వీటి గుడ్లకు కూడా చాలా డిమాండ్ ఉంది.
వీటిని ఎలా పెంచాలో కోర్సు కూడా ఇస్తారు.. పౌల్ట్రీ రంగంలో రాణించాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు చాలా ఉపయోగకరం. ఇప్పటికే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారు కూడా అదనపు ఆదాయం కోసం టర్కీ కోళ్ల పెంపకాన్ని గురించి ఆలోచించవచ్చు. వ్యాపారంలో విభిన్నంగా ముందుకు వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలని భావించేవారికి ఈ టర్కీ కోళ్ల పెంపకం బాగుంటుంది.
బ్రూడింగ్:-
మాములు కోళ్ళకు బ్రూడింగ్ ఏ విధంగా చేస్తారో.. వీటికి కూడా అదే రీతిలో చేయాలి. టర్కీలలో O – 4 వారాలు వరకు బ్రూడింగ్ చేస్తారు. అయితే చలికాలంలో 5, 6వారాల వరకు బ్రూడింగ్ పొడిగించవచ్చు. అయితే వీటికి హెవర్ క్రింద కోళ్ళు కంటే ఎక్కువ స్థలం కావాలి. ఒక్కోక్క బ్రూడరు క్రింద 50 టర్కీ పిల్లలను ఉంచాలి. ఇది పొదిగిన 45 గంటలలో వీటికి ఫీడ్, నీళ్ళు ఇవ్వాలి. వీటికి 10 పిల్లలకు 100 మీ.లీ. పాలతో పాటు ఒక ఉడక పెట్టిన గుడ్డు మొదటి రెండు వారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్రూడింగ్ కొరకు ఉష్ణోగ్రత 98 డిగ్రీలు ఉండాలి.
టర్కీలు పచ్చని మేలు రకాల గడ్డిని తింటాయి. కనుక ఎదిగే సమయంలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది. వీటిని కోళ్ళ మాదిరిగానే ఊక చల్లిన నేల మీద లేదా బ్యాటరీ బ్రూడరులో పెంచవచ్చు. లిట్టరు ఎల్లప్పుడూ పొడిగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలి.