కన్యాదానం అర్థాన్ని వివరించిన నీతా అంబానీ .. అతిథులు ఎమోషనల్

-

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ‘కన్యాదానం’ అర్థాన్ని వివరించారు. ఆమె మాటలకు అంబానీ కుటుంబసభ్యులతో పాటు అతిథులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధాన్ని, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె ఆస్తి కాదు ఒకరికి బదిలీ చేయడానికి..! ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కన్యాదానానికి నిజమైన అర్థం ఏంటంటే.. వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించడం.. అమూల్యమైన తన కుమార్తెను అతడి కుమారుడి చేతుల్లో పెట్టడం..! నేను కూడా ఓ కుమార్తెనే.. ఒక అమ్మాయికి తల్లిని, అత్తను కూడా. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులు. వారు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కుటుంబాలు సంతోషమనే వెలుగులతో విరాజిల్లుతాయి’’ అని నీతా వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news