డీజిల్‌ వాహనాలపై పొల్యూషన్‌ ట్యాక్స్‌.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్

-

డీజిల్‌ వాహనాలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటి విక్రయాలు నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో డీజిల్‌ వాహనాలపై 10 శాతం అదనంగా జీఎస్టీ విధించేందుకు ఓ ప్రతిపాదనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీన్ని ‘పొల్యూషన్‌ ట్యాక్స్‌’గా అభివర్ణిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను ఓ లేఖ అందించాలనుకుంటున్నట్లు తెలిపినట్లు సమాచారం. వాయు కాలుష్యం తగ్గించాలన్నదే దీని ఉద్దేశమని తెలిసింది.

‘‘డీజిల్‌ వాహనాలను ఆటోమొబైల్‌ పరిశ్రమ తగ్గించాలని కోరుతున్నా. ఒకవేళ మీరు వాహన ఉత్పత్తిని తగ్గించకుంటే.. పన్ను విధించాల్సి ఉంటుంది. అప్పుడు వాహనాలు విక్రయించడం మరింత కష్టమవుతుంది’’ అని సియామ్‌ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. దేశంలో ఇప్పటికే డీజిల్‌ కార్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, తయారీ సంస్థలు వాటిని పూర్తిగా ఆపాల్సిన అవసరం ఉందని… పర్యావరణానికి డీజిల్‌ హాని కలిగిస్తోందని, దీనివల్ల దిగుమతుల బిల్లూ పెరుగుతోందన్నారు. అయితే తాజాగా ఇలాంటి ప్రతిపాదన ఇప్పట్లో తీసుకువచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని నితిన్ గడ్కరీ ఎక్స్ (ట్విటర్) వేదికగా క్లారిటీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news