నిన్న పాకిస్తాన్ పై భారీ విజయం తర్వాత ఇండియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. వర్షం కారణంగా రెండు రోజులు ఆడిన ఈ మ్యాచ్ లో ఇండియా అన్ని విభాగాలలో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. కానీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు శ్రీలంక తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఒక రికార్డ్ ఊరిస్తూ ఉంది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 247 వన్ డే లలో ఆడగా 48 .91 సగటుతో 9978 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇతను మరో 22 పరుగులు కనుక చేస్తే వన్ డే లలో రోహిత్ కూడా పది వేల పరుగుల లిస్ట్ లో చేరిపోనున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 30 సెంచరీ లు మరియు 50 డబుల్ సెంచరీ లు పూర్తి చేశాడు.
కాసేపటి క్రితమే శ్రీలంక తో ఇండియా మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే రోహిత్ మరోసారి మెరిసి రికార్డును చేరుతాడా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా కనుక గెలిస్తే ఆసియ కప్ ఫైనల్ కు చేరుకుంటుంది.