31 మంది మంత్రులతో నితీశ్ కేబినేట్ కూర్పు..ఆ పార్టీ వారికే ఎక్కువ !

-

బీహార్ మంత్రివర్గం రెడీ అయింది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 31 మంది మంత్రులతో నితీశ్ మంత్రివర్గం కూర్పు సిద్ధం అయింది. లాలూ పార్టీ కి అధిక మొత్తంలో మంత్రి పదవులు దక్కాకి. నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం లోని
భాగస్వామ్య పక్షాలైన జనతా దళ్-యునైటెడ్ ( జేడి-యు), లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని “రాష్ట్రీయ జనతా దళ్” ( ఆర్.జే.డి), కాంగ్రెస్ పార్టీ, “హిందుస్థాని అవామ్ మోర్చా” ( హెచ్.ఏ.ఎమ్), స్వతంత్ర అభ్యర్ది కి మంత్రివర్గంలో చోటు కల్పించారు నితీస్‌కుమార్‌.

గత మంత్రివర్గంలో “జనతా దళ్-యునైటెడ్ ( జేడి-యు) కు చెందిన మంత్రులందరూ యధాతధంగా కొనసాగించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. జేడి-య నుంచి 11 మంది, ఆర్.జే.డి నుంచి 15 మంది తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, “హిందుస్థాని అవామ్ మోర్చా” నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్ది సుమిత్ కుమార్ సింగ్ కూ మంత్రివర్గంలో చోటు దక్కింది. నితీశ్ కుమార్ మంత్రివర్గంలో మొత్తం 36 మంత్రులు ఉండవచ్చు. అయుతే, మూడు నుంచి నాలుగు మంత్రి పదవులను ఖాళీగా ఉంచే అవకాశం ఉంది. భవిష్యత్ లో జరిగే మంత్రివర్గ విస్తరణ లో రాజకీయ సమీకరణాలు, అవసరాల మేరకు ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news