టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా..!

-

టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా మరణించిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ముంబై లోని వర్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిసాయి. అయితే ఆయన తరువాత ట్రస్ట్ చైర్మన్ ఎవ్వరినీ ఎన్నుకోవాలని ఆలోచన చేసి.. చివరికీ టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ కీలక ప్రకటన చేశారు. ఈయన రతన్ టాటాకు వరుసకు సోదరుడు అవుతారు నోయెల్ టాటా. 2012లో టాటా సన్స్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత రతన్ టాటా టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న నోయెల్ టాటా నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్నారు. అతను ట్రెంట్, వోల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మరియు టాటా స్టీల్ మరియు టైటాన్ కంపెనీ లిమిటెడ్‌కు వైస్ చైర్మన్‌గా సహా వివిధ టాటా గ్రూప్ కంపెనీల బోర్డులలో పనిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news