కంగనపై పోస్టు వివాదం.. కాంగ్రెస్‌ నేతపై జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు

-

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే కంగనాపై చేసిన పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రియా శ్రీనతేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. తన ఫిర్యాదులో హెచ్‌.ఎస్‌.అహిర్‌ పేరును ప్రస్తావిస్తూ.. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏ మాత్రం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ ప్రకటించగా.. ఆమెను ఉద్దేశించి కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ అసభ్యకర పోస్టు చేశారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ ఆమెపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్‌ చేశాయి. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్న కంగన గుజరాత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన అభ్యంతరకర సంభాషణను షేర్ చేశారు.

‘‘ఒక యువకుడికి టికెట్ లభిస్తే.. అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారు. అదే యువతికి టికెట్ ఇస్తే.. ఆమె లైంగికతపై దాడి జరుగుతుంది. ఇదేం విచిత్రమో. కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఇలాంటి అసభ్యకరమైన ధోరణి సిగ్గుచేటు’’ అని విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news