బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం అన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి. ఏపీలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్దార్ద్ నాధ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. అలాగే… ఈ సమావేశానికి ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ…టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారన్నారు.
మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని చెప్పారు. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని పేర్కొన్నారు. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు….పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుంది…భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారన్నారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం….సెక్రటేరీయేట్టును, మద్యాన్ని, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని మండిపడ్డారు.