ఇండియాలోకి ఒమిక్రాన్ BF7 ఎంట్రీ.. గుజరాత్ లో తొలి కేసు

-

చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అక్కడి ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతోంది.  చైనాలో కఠిన ఆంక్షలు అమలుచేసినప్పటికీ అక్కడ వైరస్‌ విజృంభణకు కారణం ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ బీఎఫ్‌7 అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ వేరియంట్‌ భారత్‌లోనూవ్యాప్తి చెందింది. గుజరాత్‌లో తొలి కేసు నమోదైనట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ రకం కేసులు మూడు వరకు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో ఒకటి వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అయితే, ఈ కేసుల్లో పెరుగుదల గణనీయంగా ఏమీ లేదని ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ రోజు వైద్యరంగ నిపుణులు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

భారత్‌లో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూసినప్పటికీ కేసుల్లో మాత్రం పెరుగుదల ఏమీ లేదని మాండవీయ  తెలిపారు. ఎలాంటిపరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నట్టు వెల్లడించారు. ప్రజలంతా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని నీతిఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకేపాల్‌ సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు/వృద్ధులు కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version