రేపు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్​

-

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటికే పెను ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మరో పెద్ద ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్​ఏ) సిద్ధమైంది. శనివారం రోజున దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేయనున్నట్లు వెల్లడించింది. బుధవారం రాత్రి కోల్​కతాలోని ఆర్​జీ కర్​ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొంది.

రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్​ఏ ఈ నిర్ణయం తీసుకుంది. కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టిన సమయంలో వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయని ఐఎమ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్​ మెడిసిన్​ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.  వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారని.. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్​ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version