అమిత్‌ షాకు దమ్ముటే..చైనాలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి – ఎంఐఎం

-

పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. అమిత్ షాకు దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాల్ విసిరారు. పాతబస్తీలో ఎలా సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తారో చూద్దామంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ స్టీరింగ్ MIM చేతిలో ఉంటే ఆమిత్ షాకు ఎందుకు నొప్పి వస్తుందని ప్రశ్నించారు.

అటు కేసీఆర్‌ సర్కార్‌, బీఆర్‌ఎస్‌ పార్టీపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఓవైసీ వివాదస్పద వ్యాఖ్యలు. కారు స్టీరింగ్‌ తన దగ్గర లేదని పేర్కొన్నారు ఓవైసీ. బీఆర్‌ఎస్‌ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ .. స్టీరింగ్ నా దగ్గర ఉందా.. బీఆర్‌ఎస్‌ పార్టీ.. అసలు నన్ను పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు. నిజంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ స్టీరింగ్ నా దగ్గరే ఉంటె దానికి సంబంధించి ఉదాహరణలు చెప్తానని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news