ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గొడవ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు సంబంధించిన పాటలపై పాకిస్థాన్లో బ్యాన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇండియాలో బ్యాన్ చేసిన మోడీ ప్రభుత్వం.. మరికొన్ని ఆంక్షలు విధించబోతోంది.

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు సంబంధించిన సినిమా సాంగ్స్ పైన పాకిస్తాన్ దేశంలో బ్యాన్ విధించారు. కాగా, భారత్- పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఎల్‌వోసీ దగ్గర ఎనిమిదో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, ఆఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిపింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.