తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం… ఉన్నఫలంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ కోర్టు నుంచి ఢిల్లీకి పయనం అవుతారు రేవంత్ రెడ్డి.

పహాల్గం ఉగ్రదాడి అలాగే జనగణనలాంటి అంశాలపై ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా… కాంగ్రెస్ పార్టీ అగ్రనేతులందరూ పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. 42వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.