దయాది దేశం పాకిస్థాన్ ప్రయోగించిన ఓ మిస్సైల్ టెస్ట్ విఫలం అయింది. ప్రయోగించిన కొంత సేపటికే నేలపై కూలిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో ప్రాంత ప్రజలు గురువారం గుర్తు తెలియని ఎగిరే వస్తువు ఆకాశం నుండి పొగతో పడిపోవడాన్ని గమనించారు. వస్తువు స్పష్టంగా రాకెట్ ను పోలి ఉందని ప్రజలు తెలిపారు.
పాకిస్థాన్ లోని సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన ఒక మిస్సైల్ ప్రయోగించిన తర్వాత సాంకేతిక సమస్యలతో కూలిపోయింది. అయితే ముందుగా ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ లో లోపం కారణంగా పరీక్ష ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన టెస్ట్ మరోగంట వాయిదా పడింది. ఆ తరువాత ప్రయోగించిన క్షిపణి సింధ్‌లోని థానా బులా ఖాన్ సమీపంలో కూలిపోయింది.
అయితే ఇటీవల ఇండియా నుంచి ఓ క్షిపణి సాంకేతిక కారణాలతో లాంచ్ అయి పాకిస్థాన్ లో కూలిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇటీవల భారత్ చేపట్టిన మిస్సైల్ ప్రయోగానికి ప్రతిస్పందనగా క్షిపణిని పరీక్షించింది. పాకిస్తాన్ క్షిపణి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై సమీపంలో పడిపోయింది అంటూ ట్విట్స్ చేశాయి.