ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మంచి పోషకాహారం తీసుకోవాలి. దానితో పాటుగా వేళకు నిద్ర పోవాలి. వ్యాయామం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వంటివి కూడా చాలా ముఖ్యం. అయితే గర్భిణీల ఆరోగ్యం బాగుండాలంటే వీటిని ఫాలో అవుతూ ఉండాలి.
గర్భిణీలు కనుక సరిగా నిద్ర పోతే ఈ అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి గర్భిణిలు వేళకు నిద్రపోతూ ఉండాలి లేదంటే అనవసరంగా ఈ సమస్యలు బారిన పడాల్సి వస్తుంది. సాధారణంగా గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు గురి అవ్వాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అనుకుంటే పొరపాటే.
నెలలు మారే కొద్ది కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గర్భిణీలు సరిగ్గా నిద్రపోక పోతే ఈ సమస్యలు తప్పవు. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. గర్భిణీలకు నిద్ర సరిగా లేకపోతే హైబీపీ, కిడ్నీ సమస్యలు వస్తాయి. అలానే ప్రిమెచ్యూర్ బర్త్ కి కూడా కారణమవుతుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల గస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని గైనికాలజిస్ట్ అంటున్నారు.
గర్భిణీలకు నిద్ర ఎందుకు పట్టదు..?
గర్భిణీలకు ఒళ్ళు నొప్పులు నడుం నొప్పి వంటివి ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి ఎటువంటి నొప్పి లేకుండా చూసుకోవాలి.
అలానే గర్భిణీలకు తరచు యూరిన్ వస్తూ ఉంటుంది. దీని వల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
కొంత మంది గర్భిణీలు అయితే గుండెలో మంట, గొంతు నొప్పి వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని వల్ల కూడా నిద్రకి ఇబ్బంది వస్తుంది.
నిద్ర పోయినప్పుడు వికారం కలగడం, లెగ్ క్రామ్ప్స్ లాంటి సమస్యలు కూడా నిద్రపట్టనివ్వవు.
అయితే బాగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి..?
నిద్ర బాగా పట్టాలంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. కెఫీన్, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. నిద్రపోవడానికి ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండాలి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది అలానే సమస్యలు కూడా రావు.