కుర్చీ కోసం కొట్లాట‌.. గెలిచేదెవ‌రో..!

-

త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకేలో కొన‌సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. అయితే
నా య‌కుల మ‌ధ్య రాజుకున్న వివాదం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. పార్టీ కోకన్వీనర్, సీఎం పళనిస్వామి, పన్నీరుసెల్వంల ఆదిప‌త్య పోరులో క్యాడ‌ర్ మొత్తం గంద‌ర‌గోళంలో ప‌డే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పళనిస్వామి, పన్నీరుసెల్వంల మ‌ద్ద‌తుదారుల ‌మ‌ధ్య మంగళవారం, బుధ‌వారం వ‌రుస‌గా రెండు రోజుల‌పాటు మంత‌నాలు కొన‌సాగాయి. మంగ‌ళ‌వారం పొద్దుపోయే వరకు ఓ వైపు పన్నీరు నివాసంలో, మరో వైపు పళని నివాసంలో ముఖ్యనేతల భేటీలు సాగాయి.

అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ను బుజ్జగించేందుకు రాయబారాలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు మద్దతు నేత నత్తం విశ్వనాథన్‌ ద్వారా ఈ ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. ఎట్టకేలకు అధికారిక సమీక్షకు పన్నీరు బుధవారం హాజరయ్యారు. అయితే, పన్నీరును బుజ్జగించేందుకు ఆయన మద్దతుదారుడైన మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌ను అస్త్రంగా ప్రయోగించే పనిలో పళని శిబిరం నిమగ్నం కావడం చర్చకు దారి తీసింది. గంటన్నర పాటు అధికారులతో సమీక్షలో మునిగిన పన్నీరు, ఆ తర్వాత త‌న నివాసానికి వెళ్లారు. అక్కడ తన మద్దతు ముఖ్యనేతలతో మళ్లీ మంతనాల్లో మునిగిపోవ‌డంతో ఈ వివాదానికి ఇక ఇప్ప‌ట్లో తెరపడే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version