ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

-

ఈ నెలలో ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అమృత కాలం నేపథ్యంలో జరిగే ఈ ప్రత్యేక సమావేశాల్లో ఫలప్రదమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు  తెలిపారు.

ప్రస్తుత 17వ లోక్‌సభ.. 13వసారి సమావేశమవుతుండగా రాజ్యసభకు మాత్రం ఇది 261వ సమావేశం. జీ20 సదస్సు ముగిసిన తర్వాత జరిగే ఈ సమావేశాల అజెండా ఏంటనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే పార్లమెంట్ నూతన భవనంలోకి మారేందుకే ఈ సమావేశాలు అనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై.. కొత్త భవనంలో ముగుస్తాయని సమాచారం. వీటితో పాటు జీ-20 సదస్సులో కీలక చర్చలు, జమ్ము కశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news