ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటీషన్ సుప్రీంకోర్టు కాజాగా విచారించింది. తప్పుతో పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్ళు మూసుకొని కూర్చున దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనలు విషయంలో ఇంకా ఆలస్యం వద్దని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవ్వాలా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనాల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే కేంద్రం తరపు న్యాయవాదిని అత్యున్న న్యాయ స్థానం కోరింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ బాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమాన తప్పదని తెలిపింది కంపెనీ చేస్తున్న నిరాదారమైన మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్క ఉత్పత్తిపై కోటి రూపాయలు చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ యాడ్స్ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది కూడా. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయి అంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది.