ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. అమిత్ షా, నడ్డాతో భేటీ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఇవాళ మధ్యాహ్నం జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్య బోధ చేయనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version