సాధారణంగా సామన్యుల పిల్లలు అసామాన్య ప్రతిభతో టాప్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలతో పోటీ పడి విజేతలు అయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. వాటిని సాధించాలనే తపన ఉంటే. ఎవ్వరూ అయినా విజయం సాధించవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన నిషి గుప్త పాన్ షాపు యజమాని కూతురు బుధవారం ప్రకటించిన ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్ లో సత్తా చాటింది. ప్రథమ స్థానంలో నిలిచి అందరితో శభాష్ అనిపించుకుంది.
తొలి ప్రయత్నంలోనే నిషి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. లాలో గ్రాడ్యుయేట్ చేసిన వారందరూ ఈ పరీక్షకు అర్హులు అయ్యారు. జడ్జీలుగా ఎంపిక చేయడానికి పెట్టే ఎంట్రీ లెవల్ ఎగ్జామ్ ఆ పరీక్షలో నిషి గుప్త ప్రథమ స్థానం దక్కించుకుంది. ఉత్తీర్ణులైన వారిని జిల్లా, మెజిస్ట్రేట్, అటర్నల్ జనరల్, సబ్ మెజిస్ట్రేల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితరాలుగా ఎంపికవుతారు. వీరిని హైకోర్టు ఎంపిక చేస్తుంది. నిషి పాఠశాల విద్యను ఫాతిమా కాన్వెంట్ లో పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ 2020లో పూర్తయింది.