హ‌ర్యానా పౌరుల‌కు గుడ్ న్యూస్‌.. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేష‌న్ల‌కు ఓకే..!

-

ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75 శాతం రాష్ట్ర ప్రజలకు కేటాయించే బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ చట్టాన్ని గతేడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.

“ఇది రాష్ట్ర యువతకు ఎంతో సంతోషకరమైన రోజు. రాష్ట్రంలోని యువతకు ఇప్పుడు ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.” అని ఆయన అన్నారు. 2019 లో 90 సీట్లలో 10 స్థానాల్లో గెలిచిన తరువాత బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చౌతాలా జన్నాయక్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల వాగ్దానం.. స్థానికులకు ప్రైవేటు రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్లు.. ఈ క్ర‌మంలోనే ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెర‌వేర్చారు. ‌

హ‌ర్యానాలో ఇక‌పై ప్రైవేటు రంగ సంస్థలు స్థానికుల‌కు ఉద్యోగాల్లో 75 శాతం మేర రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించాలి. ఈ బిల్లు గతేడాదే ప్ర‌వేశ‌పెట్టారు. కానీ ఇది తాజాగా ఆమోదం పొందింది. ఇక స్థానికుల‌కు నెల‌కు రూ.50వేల వేత‌నంతో కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కంపెనీల‌కు త‌గిన అభ్య‌ర్థులు దొర‌క‌క‌పోతే ప్ర‌భుత్వానికి వివ‌రాలు తెలిపి ఇత‌ర రాష్ట్రాల నుంచి అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాల్లో పెట్టుకోవ‌చ్చు. ఇక స్థానికుల‌కు ఉద్యోగాల‌ను ఇచ్చే క్ర‌మంలో నెల‌కు రూ.50వేల వ‌ర‌కు వేత‌నాల‌ను ఇవ్వాలి. అలా చేయ‌క‌పోతే కంపెనీల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటారు. ఫైన్లు విధిస్తారు. ఇక ఆ రాష్ట్రంలో ప్రైవేటు కంపెనీల‌న్నీ త‌మ ఉద్యోగుల వివ‌రా‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version