భారతదేశ రైతులకు అదిరిపోయే శుభవార్త అందించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కొత్తగా ప్రభుత్వంలోకి రాగానే… రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ ఇవాళ 17వ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ…. 9.26 కోట్ల మంది రైతులు అకౌంట్లో ₹20,000 కోట్లు జమ చేయనున్నారు.
దీంతో పాటు 30 వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాదా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడుదల లో 6000 రూపాయల నగదు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 విడతల్లో ఈ పీఎం కిసాన్ నిధులను అందజేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక ఇవాళ 17వ విడత రిలీజ్ కాబోతున్నాయి.