pm kisan samman nidhi : డ‌బ్బులు పడేది ఎప్పుడంటే?

ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కానికి సంబంధించిన న‌గ‌దు ను డిసెంబ‌ర్ రెండో వారం కానీ మూడో వారంలో కాని జ‌మ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ డిసెంబ‌ర్ మార్చి విడ‌త కు సంబంధించిన న‌గ‌దును ఈ సారి నేరు గా ల‌బ్ధి దారుల‌ను రైతుల అకౌంట్ ల‌లోనే జ‌మ చేయ‌నున్నారు.

ఈ డిసెంబ‌ర్ మార్చ్ విడుత కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ. 22 వేల కోట్ల విడుద‌ల చేయ‌డానికి సిద్ధం గా ఉంది. అయితే ఈ విడుత కు ప‌శ్చిమ బెంగాల్ నుంచి కొత్త గా 15 ల‌క్ష‌ల మంది రైతులు ప్ర‌ధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కానికి అర్హులు కానున్నారు. దీంతో మొత్తం ల‌బ్ధి దారుల సంఖ్య 11 కోట్లు దాటనుంది. కాగ రైతుల ప్రొత్స‌హ‌కం ఇవ్వాల‌నే ఉద్ధేశంతో ప్ర‌తి ఏట మూడు విడుత‌ల‌లో రూ. 2000 చొప్పున విడుద‌ల చేయ‌నున్నారు. మొత్తం గా ప్ర‌తి సంవ‌త్స‌రానికి రూ. 6000 ల‌ను రైతుల ఖాత ల లో జ‌మా చేయ‌నున్నారు.