Silver Price Update : వెండి కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

దేశ వ్యాప్తం గా వెండి కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌. ఈ రోజు వెండి ధ‌రలు భారీగా త‌గ్గాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీ స్థాయి లో వెండి ధ‌ర త‌గ్గింది. తెలుగు రాష్ట్రాల‌లో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 900 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే ఢిల్లీ , ముంబై వంటి న‌గ‌రాల్లో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 1,600 వ‌ర‌కు త‌గ్గింది.

ఇంత పెద్ద మొత్తం లో వెండి ధ‌ర త‌గ్గ‌డం చాలా రోజుల త‌ర్వాత ఇదే తొలి సారి. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి వెండి ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఒక వారం రోజుల్లో నే ఒక కిలో గ్రాము వెండి పై దాదాపు రూ. 2800 వ‌ర‌కు త‌గ్గింది. కాగ పెళ్లి ల సిజ‌న్ లో వెండి ధ‌ర‌లు భారీ గా త‌గ్గ‌డం తో సామాన్యు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ప్ర‌స్తుతం త‌గ్గిన ధ‌ర ల‌తో దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో వెండి ధ‌ర ఇలా ఉంది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 900 త‌గ్గి.. రూ. 69,950 వ‌ద్ద స్థిర ప‌డింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని విజ‌య‌వాడ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 700 త‌గ్గి.. రూ. 70,700 వ‌ద్ద స్థిర ప‌డింది.

మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 1600 త‌గ్గి.. రూ. 64,000 వ‌ద్ద ఉంది.

మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 1600 త‌గ్గి.. రూ. 64,000 వ‌ద్ద ఉంది.

కోల్ క‌త్త న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 1600 త‌గ్గి.. రూ. 64,000 వ‌ద్ద స్థిర ప‌డింది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 1600 త‌గ్గి.. రూ. 64,000 వ‌ద్ద ఉంది.