ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం : ప్రధాని మోదీ

-

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజిబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఒడిశాలో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని మోదీ అన్నారు. జూన్ 10న ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

“జగన్నాథుని పుణ్యభూమిలో నేను ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్, 25 ఏళ్లపాటు బీజేడీ అధికారంలో ఉంది.  సారవంతమైన భూమి, ఖనిజ వనరులు, సముద్ర తీరం, బ్రహ్మపూర్‌ వంటి వాణిజ్య కేంద్రం, సంస్కృతి, వారసత్వం ఉన్నప్పటికీ ఒడిశాకు ఏం జరిగిందో అంతా చూశారు. ఒడిశా ధనిక రాష్ట్రమైనప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారు. ఈ పాపానికి కాంగ్రెస్, బీజేడీ కారణం. రాసిపెట్టుకోండి ఒడిశాలో జూన్ 4న బీజేడీ ప్రభుత్వానికి గడువు తీరుతుంది. జూన్ 10న భువనేశ్వర్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇక్కడికి వచ్చాను.” అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version