”ప్రపంచ బాహుబలి’గా భారత్.. భవిష్యత్‌లో నిర్ణయాత్మక శక్తిగా’

-

ప్రపంచానికి భారత్ బాహబలి లాంటిదని ప్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అన్నారు. భవిష్యత్‌లోనూ భారత్​ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందని ప్రశంసించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలకుగౌరవ అతిథిగా హాజరయ్యారు. ఐరోపాలోనే అతి పెద్ద కవాతుగా పేరుగాంచిన బాస్టీల్‌ డే పరేడ్‌లో భారత సైనికులు కుడా పాల్గొన్నారు. తన రెండురోజుల ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఘనమైన లక్ష్యాలతో భారత్‌-ఫ్రాన్స్ మధ్య రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన వ్యూహాత్మక బంధానికి మార్గసూచీని సిద్ధం చేస్తున్నట్లు చర్చల తర్వాత ప్రధాని మోదీ ప్రకటించారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు రక్షణ సహకారమే మూలస్తంభం అని అన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారంపైనా మంతనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హెలికాప్టర్‌ ఇంజిన్లు, విడిభాగాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల సదుపాయాలను ఫ్రెంచ్ కంపెనీలు భారత్‌లోనే ఏర్పాటు చేసేలా చర్చలు సాగుతున్నాయని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news